Bharateeyudu 2 Latest Update

Bharateeyudu 2 Latest Updates
Bharateeyudu 2 Latest Updates 

భార‌తీయుడు-2 స‌న్నాహాల్లో శంక‌ర్: విశ్వ‌న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన `భార‌తీయుడు` (ఇండియ‌న్ -త‌మిళ్‌) ఎంత పెద్ద సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెలిసిందే. దాదాపు రెండు దశాబ్ధాల క్రితం రిలీజైన ఆ సినిమాకి సీక్వెల్ తెర‌కెక్కిస్తున్నామ‌ని శంక‌ర్ ఇదివ‌ర‌కూ తైవాన్‌లో ఆవిరి బెలూన్ ఎగురవేసి మ‌రీ ప్ర‌క‌టించారు. అయితే ఇటీవ‌లి కాలంలో రోబో 2(2.ఓ) చిత్రీక‌ర‌ణలో బిజీగా ఉండ‌డం వ‌ల్ల మ‌ళ్లీ ఈ విషయం తెర‌పైకి రాలేదు.

తాజాగా భార‌తీయుడు 2ని రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణకు శంక‌ర్ వేగంగాస‌న్నాహాలు చేస్తున్నారుట‌.ఇందులో బాలీవుడ్ స్టార్ న‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది. స‌ద‌రు బాలీవుడ్ స్టార్‌తో శంక‌ర్ మంత‌నాలు సాగిస్తున్నారు. ఆ స్టార్ ఎవ‌రు అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *