Kaala Audio Date 9th May

Kaala Release Date Poster - June 7th
Kaala Release Date Poster – June 7th

The audio of the much awaited Pa Ranjith’s film Kaala, starring Rajinikanth, will be released on 9 May.

9న కాలా ఆడియో: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘కాలా’ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా పాటలను ఈ నెల తొమ్మిదో తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చెన్నై నందనంలోని వైఎంసీఏ మైదానంలో భారీ ఎత్తున ఈ ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

రజనీకాంత్‌ అల్లుడు, నటుడు ధనుష్‌ ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం సమకూర్చారు. ఈ కార్యక్రమాన్ని ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు చిత్రవర్గాలు ప్రకటించాయి. అంతేకాకుండా సంతోష్‌ నారాయణన్‌కు చెందిన బృందంతో సంగీత విభావరి నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *