Kaala Pre-Release Event On 29th May At HYD

Kaala Pre-Release Event On 29th May At HYD

తమిళ సూపర్ స్టార్ ‘కాలా’ సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది. రెండు గంటల నలభై ఏడు నిమిషాల నిడివితో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫస్ట్‌లుక్‌తోనే ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించిన ‘కాలా’ చిత్రానికి పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘కబాలి’ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోలేనప్పటికీ మంచి వసూళ్లనే రాబట్టింది. సాధారణంగా సూపర్ స్టార్ నటిస్తున్న సినిమా అంటేనే అభిమానుల్లో భారీ అంచనాలు వుంటాయి

దానికితోడు సూపర్ స్టార్‌ని కబాలి సినిమాలో ఓ రేంజ్‌లో తిరుగులేని డాన్‌గా చూపించిన పా రంజిత్, ఆ సినిమాకు అద్దిరిపోయే మ్యూజిక్ కంపోజ్ చేసిన యువ కంపోజర్ సంతోష్ నారాయణన్, మరో ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న హీరో ధనుష్ నిర్మాణసారధ్యం వంటివి అభిమానుల్లో ఈ సినిమా పట్ల మరింత క్రేజ్ తీసుకొచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *