Nidhhi Agerwal in Akhil – Venky Atluri Movie

Nidhhi Agerwal in Akhil - Venky Atluri Movie
Nidhhi Agerwal in Akhil – Venky Atluri Movie

అఖిల్ తో నిధి అగ‌ర్వాల్: అక్కినేని అఖిల్ ‘తొలిప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇంద‌లో అఖిల్ సరసన నాయిక‌గా చాలా మంది పేర్లు వినిపించాయి. వారిలో రష్మిక మందన్న పేరు ప్రముఖంగా వినిపించగా ఇప్పుడు నిధి అగర్వాల్ తెర మీదికొచ్చింది.

అఖిల్ కు జోడీగా కొత్త నటి అయితే బాగుంటుందని భావించిన దర్శక నిర్మాతలు నిధి అగర్వాల్ ను పరిశీలిస్తున్నారట. ఇప్పటికే ఆమె టెస్ట్ షూట్లో పాల్గొన్నారని, ఆమె పెర్ఫార్మెన్స్ పట్ల మేకర్స్ పాజిటివ్ గా ఉన్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో? నిధి అగర్వాల్ ప్రస్తుతం నాగ చైతన్య తాజా చిత్రం ‘సవ్యసాచి’లో నటిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *