Officer Release from 25th May to 1st June

ఆఫీస‌ర్ వాయిదా


రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన చిత్రం ‘ఆఫీసర్’. చాలా కాలం తర్వాత నాగ్‌ పోలీస్‌ గెటప్‌లో నటించడం..దాదాపు 25 ఏళ్ల తర్వాత వర్మ-నాగ్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. మే 25న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాను జూన్‌ 1కి వాయిదా వేసినట్లు తాజాగా వర్మ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు.

ఆఫీసర్‌’ సినిమా సాంకేతికంగా బాగా రావాలని.. ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలని అనుకుంటున్నాం. దాంతో ముందుగా అనుకున్న దాని కంటే సాంకేతిక అంశాలకు మరింత సమయం పట్టేలా ఉంది. అందుకే ఈ సినిమాను జూన్‌ 1కి వాయిదా వేస్తున్నాం’ అని తెలిపారు.

(Visited 14 times, 1 visits today)
Please follow and like us:
1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)