Prabhas-Sujeeth Saaho Story… ?

Saaho Story... what?

Saaho Story… ?
రెండు పాత్రల్లో సాహో ప్రభాస్?.. కథ గురించి ముచ్చట్లు…

టాలీవుడ్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి ప్రభాస్ రానాల చిత్రం బాహుబలి. బాహుబలితో ప్రభాస్ రేంజ్ ఎంతలా పెరిగిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ చేస్తున్న చిత్రం సాహో.

బాహుబలి, బాహుబలి 2 విడుదలకు ముందు చిత్ర కథ గురించి ప్రతి ఒక్కరు ఎంతలా వెతికారో, రకరకాలుగా మీడియాలో ఎలా రాసుకున్నారో .. అదే విధంగా ఇప్పుడు సాహో చిత్ర కథ గురించి కూడా రకరకాలుగా ఊహిస్తున్నారు.

సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న చిత్రం టీజర్ చూసిన తర్వాత హాలీవుడ్ లేవల్ లో తీస్తున్న చిత్రంగా భావిస్తున్నారు. వినూతన్న కథతో 150 భారీ బడ్జెట్ తో చేస్తుండడంతో రకరకాలుగా ఊహాగానాలు వస్తున్నాయి.

ఇందులో ప్రభాస్ రెండు పాత్రలలో కనిపించనున్నారని, కథ పునర్జన్మకి సంబంధించిన కథ అని, బాలీవుడ్ స్టార్స్ విలన్ గా నటిస్తున్నారని ఇంకా అనేక రకాలుగా వస్తున్న వార్తలపై త్వరలో క్లారిటీ రానుంది. శ్రధ్దా కపూర్ ఇందులో హీరోయిన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *