Rajamouli appreciates Mahanati

Rajamouli appreciates Mahanati
Rajamouli appreciates Mahanati

మ‌హాన‌టి పై రాజ‌మౌళి ప్ర‌శంస‌లు జ‌ల్లు: భారీ అంచనాల మధ్య బుధవారం విడుదలైన ‘మహానటి’ చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ సినిమాను చూసిన పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు యూనిట్‌ సభ్యులను అభినందిస్తూ ట్వీట్లు చేశారు. సినిమా అద్భుతంగా తెరకెక్కించారని, నటీనటుల ప్రదర్శన చక్కగా ఉందని పేర్కొన్నారు.

ఈ సినిమాలో అలనాటి నటి సావిత్రి పాత్రను కీర్తి సురేశ్‌ పోషించిన సంగతి తెలిసిందే. నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు. వైజయంతి మూవీస్‌ సంస్థ నిర్మించింది. సమంత, విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రల్లో నటించారు. మిక్కీ జే మేయర్‌ బాణీలు అందించారు. ఈ సినిమా కోసం చిత్ర బృందం దాదాపు ఏడాదిన్నర కష్టపడింది. అనేక పరిశోధనలు చేసి సావిత్రి జీవిత చరిత్ర తెలుసుకుంది. ఈ చిత్రాన్ని ఉద్దేశించి ఎస్‌.ఎస్‌. రాజమౌళి, మంచు లక్ష్మి, మంచు మనోజ్‌ తదితరులు ట్వీట్లు చేశారు.

సావిత్రిగారి పాత్రలో కీర్తి సురేశ్‌ నటించిన తీరు, అద్భుతమైన ప్రదర్శనను ఇప్పటి వరకు నేను ఎప్పుడూ చూడలేదు. ఇది కేవలం ఇమిటేట్‌ చేయడమే కాదు.. ఆమె లెజెండరీ నటికి మళ్లీ జీవం పోశారు. దుల్కర్‌ సల్మాన్‌ అద్భుతంగా నటించారు. ఇప్పటి నుంచి నేను ఆయన అభిమానిని. నాగ్‌ అశ్విన్‌, స్వప్న దత్‌కు శుభాకాంక్షలు. మీలోని నమ్మకం, నిలకడ, సంకల్పం తిరుగులేనివి’ అని అన్నారు.

(Visited 9 times, 1 visits today)
Please follow and like us:
1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)