Srinivasa Kalyanam Release Date – July 21st

శ్రీనివాస క‌ళ్యాణంకి ముహూర్తం

నితిన్, రాశి ఖ‌న్నా, నందితా శ్వేత హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘శ్రీ‌నివాస క‌ళ్యాణం’. ‘శ‌త‌మానం భ‌వ‌తి’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాన్ని తెర‌కెక్కించిన స‌తీష్ వేగేశ్న ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా.. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాని జూలై 21న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని తెలిసింది. గ‌తేడాది ఇదే తేదికి ‘ఫిదా’ చిత్రం విడుద‌లై మంచి విజ‌యం సాధించిన నేప‌థ్యంలో.. ఆ సెంటిమెంట్‌తోనే ‘శ్రీ‌నివాస క‌ళ్యాణం’ని కూడా విడుద‌ల చేయబోతున్న‌ట్లు చిత్ర స‌న్నిహిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *