CelebsNews

Raviteja to do a dual role in Vi Anand film


Raviteja to do a dual role in Vi Anand film... విఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరో గా చెయ్యబోతున్న సినిమాను రామ్ తాళ్ళూరి నిర్మించబోతున్నారు. డిసెంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. తండ్రి, కొడుకులుగా రవితేజ ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడని సమాచారం . తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో దర్శకుడిగా వి.ఐ.ఆనంద్ తానేంటో నిరూపించుకున్నాడు. .

సుధీర్ బాబు నటించిన నన్ను దోచు కుందువటే సినిమాలో నటించిన హీరోయిన్ నభ నాటాశా ఈ సినిమాలో రవితేజ పక్కన నటించబోతోంది. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. రవితేజ అమర్ అక్బర్ ఆంథోనీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Post a Comment

0 Comments