CelebsNews

Chiranjeevi & Ram Charan to attend Antariksham 9000 KMPH pre-release


Chiranjeevi & Ram Charan to attend Antariksham 9000 KMPH pre-release... దర్శకుడు సంకల్ప్ రెడ్డి వరుణ్ తేజ్ తో చేస్తున్న ‘అంతరిక్షం’. 9000 కెఎంపిహెచ్ సైన్స్ ఫిక్షన్ సినిమా టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదల అయ్యాయి. కొత్తరకం కాన్సెప్ట్ తో ఈ సినిమా థియేటర్స్ కు రానుంది. లావణ్య త్రిపాఠి, అతిధి రావు హైదరీ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వ్యోమగామిగా వరుణ్ తేజ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. చిత్రాన్ని డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్లాన్ చేస్తోంది యూనిట్.

ప్రీ రిలీస్ ఈవెంట్ ను డిసెంబర్ 9న హైదరాబాద్ లో గ్రాండ్ గా చేయబోతున్నారు. ఈ వేడుకకు చిరంజీవి, చరణ్ ముఖ్య అతిథులుగా విచ్చేయుచున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు ఫంక్షన్ కు వస్తే సినిమాకు మరింత హైప్ వస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

అంతరిక్షం సినిమాతో మరో కొత్త కథ, కథనాలను దర్శకుడు సంకల్ప్ రెడ్డి ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు. దర్శకుడు క్రిష్ ఈ సినిమాకు మరో నిర్మాణ భాగస్వామిగా ఉన్నరు.

Post a Comment

0 Comments