CelebsNews

Nitya Menen As Savitri Role in NTR Look

ఎన్టీఆర్ : కథానాయకుడు, మహానాయకుడు అనే టైటిళ్లలో రెండు భాగాలుగా ఎన్టీఆర్ బయోపిక్ విడుదల చేయనున్నట్లు తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేస్తూ వస్తున్నా ఎవరెవరు ఏ పాత్రల్లో తెలియజేస్తూ ఈ రోజు ఎన్టీఆర్ బయోపిక్ నుంచి నిత్యమీనన్ ‘సావిత్రి’ ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్రయూనిట్.



పోస్టర్ లో బాలకృష్ణ రోలు రుబ్బుతుండగా..నిత్యమీనన్ అలా చూస్తూ ఉండిపోయిన లుక్ లో నిత్యమీనన్ సావిత్రిని మరిచిపోయేలా ఆ పాత్రలో కనిపిస్తోంది. ఈ చిత్రంలో గుమ్మడిగా..దర్శకుడు దేవి ప్రసాద్ న‌టిస్తుంటే క్రిష్.. కేవీ రెడ్డిగా, ఎన్ శంకర్.. విఠలాచార్యగా క‌నిపించ‌నున్నారు. యన్.బి.కె.ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న‌ ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సమర్పిస్తున్నాయి. చిత్రంలో ఎన్టీఆర్‌గా బాల‌య్య , అక్కినేనిగా సుమంత్‌, హెచ్ ఎం రెడ్డిగా స‌త్య‌నారాయ‌ణ‌, శ్రీదేవిగా ర‌కుల్ , హ‌రికృష్ణగా క‌ళ్యాణ్ రామ్, బ‌స‌వ‌తార‌కంగా విద్యా బాల‌న్ , చంద్ర‌బాబుగా రానా న‌టిస్తున్నారు. వీరందరి పోస్టర్లు ఇంకా విడుదల కాలేదు. ఒక్కొక్కటిగా మన ముందుకు రానున్నాయి.

Post a Comment

0 Comments