CelebsNews

Sai Dharam Tej’s Chitralahari Shooting Started Today In Hyd



Sai Dharam Tej’s Chitralahari Shooting Started Today In Hyd...సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్‌, రంగ‌స్థ‌లం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, చెరుకూరి మోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం చిత్ర‌ల‌హ‌రి. ఇటీవ‌ల లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ చిత్రం .. రెగ్యుల‌ర్ షూటింగ్ సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభమైంది. సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను 2019 ఏప్రిల్‌లో విడుద‌ల చేయడానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

సాయిధ‌ర‌మ్‌తేజ్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్, నివేదా పేతురాజ్‌ హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌, సి.ఇ.వో/ సి.ఒ.ఐ: పి.చిరంజీవి, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, లైన్ ప్రొడ్యూస‌ర్‌: కె.వి.వి.బాల సుబ్ర‌మ‌ణ్యం, కో-ప్రొడ్యూసర్: ఎం.ప్రవీణ్, నిర్మాత‌లు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం), ద‌ర్శక‌త్వం: కిషోర్ తిరుమల.

Post a Comment

0 Comments