CelebsNews

Shakalaka Shankar Movie Kedi No. 1 to release in December



"Shakalaka Shankar Movie Kedi No. 1 to release in December...‘శంభో శంకర’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుని, భారీ ఓపెనింగ్స్‌ రాబట్టుకున్న షకలక శంకర్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘కేడీ నెం1’. జాని దర్శకత్వంలో డి.గిరీష్‌ బాబు నిర్మిస్తున్నారు. ఖుషీ గడ్వీ, గుర్లిన్‌ చోప్రా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసిన డిసెంబ‌ర్ లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత డి.గిరీష్‌ బాబు మాట్లాడుతూ..‘‘శంభో శంక‌ర‌చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా జాని దర్శకత్వంలో ‘కేడీ నెం1’ అనే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తున్నాను. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది. దర్శకుడు జాని అద్భుతంగా తెరకెక్కించారు. పూర్తి స్థాయి యాక్ష‌న్ ఫిలిం. టీమ్ అంద‌రి స‌హ‌కారంతో సినిమాను అనుకున్న విధంగా రూపొందించ‌గ‌లిగాం" అన్నారు.

ద‌ర్శ‌కుడు జానీ మాట్లాడుతూ:- "కే.వి.వి. స‌త్యనారాయ‌ణ‌గారు, వార‌బ్బాయి వేణుగారి స‌పోర్ట్ తో ఈ సినిమా రూపొందుతోంది. 22 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్నాను. డైర‌క్ట‌ర్ గా ఇది తొలి సినిమా. న‌న్ను న‌మ్మి ఈ అవ‌కాశం క‌ల్పించిన నిర్మాత గిరీష్ గారికీ, హీరో శంక‌ర్ కు నా ధ‌న్య‌వాదాలు. శంక‌ర్ కామెడీ మాత్ర‌మే కాదు యాక్ష‌న్ కూడా చేయ‌గ‌ల‌డ‌ని మా సినిమా ద్వారా తెలుస్తుంది. నేను డిజైన్ చేసుకున్న క్యార‌క్ట‌ర్ కి త‌గ్గ‌ట్టుగా శంక‌ర్ అద్భుతంగా చేశాడు అని అన్నారు". ముఖుల్ దేవ్‌, జ‌హీర్ ఖాన్‌, తాగు బోతు ర‌మేష్‌, గ‌బ్బ‌ర్ సింగ్ టీమ్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః అజ‌య్ ప‌ట్నాయ‌క్‌; కెమెరాః ముజీర్‌; కొరియోగ్రాఫ‌ర్ః శివ శంక‌ర్ మాస్ట‌ర్‌; ఫైట్స్ః కృష్ణం రాజు; ప‌్రొడ్యూస‌ర్ః డి.గిరీష్ బాబు; స‌్టోరీ- స్క్రీన్ ప్లే-డైలాగ్స్-ద‌ర్శ‌క‌త్వంః జాని.

Post a Comment

0 Comments