CelebsNews

Marketlo Prajaswamyam Movie Celebrities Show


స్నేహ చిత్ర బ్యానర్‌పై పీపుల్‌ స్టార్‌ ఆర్‌. నారాయణమూర్తి నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన సినిమా ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను జూన్‌2న హైదరాబాద్‌ ప్రసాద్‌ లాబ్స్‌లో ఇండస్ట్రీ ప్రముఖుల కోసం ప్రత్యేకమైనషో వేశారు. తరువాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.....

స్టార్‌రైటర్‌ పరుచూరివెంకటేశ్వరరావు మాట్లాడుతూ – ”ఈ సమాజ శ్రేయస్సుకోసం సినిమా మాధ్యమం ద్వారా తన వంతు క షి చేస్తున్న మా అన్న ఆర్‌. నారాయణ మూర్తికి అభినందనలు. ఇవ్వాళ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారతదేశంలో కరెన్సీనోటు ఎన్ని విధాలుగా ప్రజాస్వామ్యాన్ని కాజేయడానికి ప్రయత్నిస్తుందో.. కళ్ళకి కట్టినట్టు చూపించారు. ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ ఓటు కోసం ఎవ్వరు చేయి ఛాపొద్దు నిలదీయండి.. అని చాటి చెప్పే ఒక అద్భుతమైన సినిమా. ఈ సినిమా తరువాత అయినా ఓటర్లు మారితే ఆయన విజయవంతం అయినట్లే” అన్నారు.
డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ – ”ఆర్‌. నారాయణ మూర్తి గారు నా చిన్నప్పటి నుండి ఇలాంటి సందేశాత్మక సినిమాలే తీస్తూ వస్తున్నారు. ఇవ్వాళ ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ చూశాను. చాలా మంచి సినిమా. ఆయన బాగుండాలి… ఆయన సినిమాలు బాగా ఆడాలి’ అన్నారు.
డేరింగ్‌ డైరెక్టర్‌ వివి వినాయక్‌ మాట్లాడుతూ – ”ఆర్‌. నారాయణ మూర్తి గారు అంటే ఇండస్ట్రీలో అందరికి ఒక ప్రత్యేకమైన గౌరవం. ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడు ఒకే పంథాలో సినిమాలు తీస్తూ వచ్చారు. ఆయన ఒక సముద్రాన్ని ఈదుతున్నారు. ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ ఒక మంచి సందేశాత్మక చిత్రం. ఈ సినిమా చూసి తప్పకుండా ప్రజలు మారాలి”అన్నారు.
యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ– ”ఆర్‌. నారాయణ మూర్తిలో ‘ఆర్‌’ అంటే ఒక రెవల్యూషన్‌ అని చెప్పొచ్చు. అలాగే ‘ఆర్‌’ అంటే రెస్పెక్ట్‌ కూడా. ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ సినిమా చూశాం. ఆయన ఎన్ని సమస్యల గురించి మాట్లాడాలి అనుకున్నారో అన్ని ఈ సినిమాలో చూపించారు. తప్పకుండా ఈ సినిమాని ప్రజలు ఆదరించాలి. టీమ్‌ అందరికి నా అభినందనలు” అన్నారు.
క్రియేటివ్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ – ” మా సినిమాలో చిన్న మెసెజ్‌ పెట్టి సినిమా తీద్దాం అంటేనే కొంత భయం ఏర్పడుతుంది. అలాంటిది ఆయన కంటిన్యూగా ఇన్ని సంవత్సరాలుగా సందేశాత్మక సినిమాలే తీయడం చాలా గొప్ప విషయం. నారాయణమూర్తి గారు ఈ సినిమాకు అన్ని తానై ముందుండి నడిపించారు. నారాయణ మూర్తి లాంటి వ్యక్తులు రేర్‌గా ఉంటారు. ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ సినిమా తప్పకుండా బాగా ఆడాలి’ అన్నారు.
ప్రజాయుద్ధనౌక గద్దర్‌ మాట్లాడుతూ – ”మన భారత దేశంలో 18 నుండి సుమారు 38 సంవత్సరాలు ఉన్న యువకులు దాదాపు 67 శాతం ఉన్నారు. ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ సినిమా రేపటి భవిష్యత్‌ రాజకీయ నిర్మాణం ఎలా ఉండాలో తెలిపే గైడ్‌గా ఉంది. అలాగే స్త్రీలు తలుచుకుంటే రేపటి సమాజాన్ని ఎలా మార్చగలరు అనే అంశాన్ని అత్యద్భుతంగా చూపించారు. తప్పకుండా ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకువస్తుందని నమ్ముతున్నాను. ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాను ఆదరించాలి” అన్నారు.
నటుడు ఎల్‌ బి శ్రీరామ్‌ మాట్లాడుతూ – ఆర్‌. నారాయణ మూర్తి లాంటి వ్యక్తి ప్రపంచంలో ఒక్కరే ఉంటారు. ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ సినిమా ఐదు సంవత్సరాల దినపత్రికలన్నీ వెండితెరపైన ఆవిష్కరించినట్టు అనిపించింది” అన్నారు.
నటి భవాని మాట్లాడుతూ – ”మార్కెట్లో ప్రజాస్వామ్యం’ సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చిన నన్ను ప్రోత్సహించిన నారాయణమూర్తి గారికి ధన్యవాదాలు. నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవడానికి ఈ సినిమా నాకెంతో ఉపయోగపడింది” అన్నారు.
పీపుల్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ – నేను ఆహ్వానించగానే వచ్చి నా ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ సినిమా చూసి తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ  కృతజ్ఞతలు. ఇవ్వాళ వారసత్వ రాజకీయాలు, పార్టీ ఫిరాయింపులు డెమోక్రసిని నాశనం చేస్తున్నాయి. కేవలం డబ్బు ఖర్చు పెట్టి ఎన్నకల్లో నిలబడిన వాళ్ళు… రేపు గెలిచాక వారి డబ్బు తిరిగి ఎలా సంపాదించు కోవాలి అనే ఆలోచిస్తారు తప్ప మంచి పనులు ఎలా చేస్తారు? అలా చేస్తే అది ప్రజాస్వామ్యం ఎలా అనిపించుకుంటుంది. అది ధనస్వామ్యం అవుతుంది. కేవలం డబ్బున్న వాళ్ళు 10 శాతం మందే రాజకీయ నాయకులైతే మిగతా 90 శాతం బడుగు బలహీన వర్గాల వారు ఎలా బాగుపడతారు. వారు ఎలా ఎన్నికల్లో పోటీ చేయగలుగుతారు. ఎలా గొప్ప నాయకులు అనిపించుకుంటారు. ప్రతి ఒక్కరు మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్‌ బిఆర్‌ అంబేథ్కర్‌ బాటలో ప్రయాణిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యుదయానికి తోడ్పడాలి. ‘ప్రజాస్వామ్యాన్ని అంగట్లో సరుకు చెయ్యొద్దు’ అని చెప్పేదే నా సినిమా. సెన్సార్‌ కార్యక్రమాలు ముగించుకొని త్వరలోనే మీ ముందుకు వస్తాం. తప్పకుండా అందరూచూసి ఆదరించగలరు” అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో.. దర్శకుడు ధవళ సత్యం, బి. గోపాల్‌, కోటేశ్వరావు, గోవర్ధన్‌, నటుడు కాశి విశ్వనాధ్‌ పాల్గొని ప్రసంగించారు.

Post a Comment

0 Comments