CelebsNews

Syeraa Narasimha Reddy Release Gandhi Jayanthi


చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి విడుదల తేదీని ప్రకటించింది... అక్టోబరు 2న సినిమా విడుదల చేస్తామని ప్రకటించింది చిత్ర బ‌ృందం. సినిమా షూటింగ్ పూర్తిగా పూర్తయిందని, చిరంజీవి డబ్బింగ్‌ చెప్పడానికి సిద్ధమవుతున్నారని తెలిపింది. ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకుడు . కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై సురేఖ సమర్పణలో రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉయ్యాలవాడ గురువు గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌, సతీమణి సిద్ధమ్మ పాత్రలో నయనతార, ఇతర కీలక పాత్రల్లో తమన్నా, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, కిచ్చా సుదీప్‌ తదితరులు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అమిత్‌ త్రివేదీ సంగీతాన్ని అందిస్తున్నారు. 

Post a Comment

0 Comments