Singer Smitha tests positive for Covid19


టాలీవుడ్ లో కరోనా పాజిటీవ్ ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. నిర్మాత బండ్ల గణేశ్‌ కరోనా బారిన పడి కోలుకొని డిశ్చార్జ్ కాగా ప్రముఖ డైరెక్టర్లు ఎస్ఎస్ రాజమౌళి, తేజకు కరోనా వైరస్ సోకింది. వీరిద్దరు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. తాజాగా సింగర్ స్మిత కూడా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. లక్షణాలు లేకపోయినప్పటికీ టెస్టులు చేయించుకున్న ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. తనకు కరోనా సోకిన విషయాన్ని స్మిత్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా ట్రీట్‌మెంట్ తర్వాత ప్లాస్మా దానం చేస్తానని చెప్పారు. తనను ఇటీవల కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని ఆమె రిక్వెస్ట్ చేశారు.

Post a Comment

0 Comments