Prabhas' Adipurush release date

ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రం తర్వాత భారీ బడ్జెట్ చిత్రం ‘రాధే శ్యామ్’... షూటింట్ లో బిజీ గా ఉన్న ప్రభాస్ తన కొత్త సినిమా రాధే శ్యామ్ చిత్రం తర్వాత బహు భాషా చిత్రంగా నిర్మితమవుతున్న అధిపురుష్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ ఆ సినిమా విడుదల తేది కూడా ప్రకటించారు. ఆగస్ట్ 11 ,2022 లో అధిపురుష్ సినిమా విడుదల కాబోతుంది అని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు. అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. వచ్చే సంవత్సరం జనవరి 21 నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది. ఈ సినిమాకి బాలీవుడ్ లో తానాజీ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తుండగా, టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరక్కుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా నటించనున్నారు. మిగితా తారాగణం వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.